News March 16, 2024
జగన్, చంద్రబాబు ఢిల్లీలో మోదీ పక్కనే: సీఎం రేవంత్

ఏపీలో పాలకులు ఢిల్లీలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. ‘ఇక్కడి 25 ఎంపీ స్థానాలు మోదీ ఖాతాలోనే ఉంటాయి. జగన్, చంద్రబాబు రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నా.. ఢిల్లీలో మోదీ పక్కనే ఉంటారు. వారిద్దరూ పాలించాలనుకుంటున్నారు గానీ ప్రశ్నించాలనుకోవట్లేదు. ఈ ప్రాంత సమస్యల మీద పోరాడే నాయకులు కావాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
GDK: ‘19న జీఎం కార్యాలయాల వద్ద ధర్నాను విజయవంతం చేయండి’

2024-2025లో సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి, 35 శాతం వాటా త్వరగా చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి జీడీకే 11వ గని, జీడీకే 1వ గని, ఏరియా వర్క్‌షాప్‌ల వద్ద గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడారు. లాభాల వాటా, స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యూలర్లు జారీ చేయాలని ఈ నెల 19న జిఎం కార్యాలయాల వద్ద ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News September 19, 2025
SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?
News September 18, 2025
అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్ట్

IPL మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు, వ్యాపారవేత్త సమీర్ మోదీ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్‌తో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఒకరోజు జుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో సదరు మహిళ సమీర్‌ను రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.