News October 16, 2025

జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

image

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

Similar News

News October 16, 2025

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

image

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.

News October 16, 2025

UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం

image

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్‌షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్‌లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.

News October 16, 2025

ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారు: రాహుల్

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు PM మోదీ భయపడుతున్నారని INC నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అందుకే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించినా ప్రధాని స్పందించడం లేదన్నారు. ‘ఈజిప్టులో జరిగిన పీస్ సమ్మిట్‌కు డుమ్మా కొట్టారు. ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. Op సిందూర్‌కు విరుద్ధంగా మాట్లాడినా ఊరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.