News March 28, 2024

జగన్ ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాయలసీమ కోసం వైసీపీ చేసిందేమీ లేదు. 142 ప్రాజెక్టులను రద్దు చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమలో సాగు నీటి కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ జగన్ మాత్రం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్‌కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ గోల్డ్ గెలిచాడు

News November 19, 2025

పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

image

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.

News November 19, 2025

రాగి వస్తువులు ఇలా శుభ్రం..

image

ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం ఎక్కువైంది. వీటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్. దాని కోసం కొన్ని టిప్స్. శనగపిండి, పెరుగు, ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో రాగి పాత్రలను రుద్దితే మెరిసిపోతాయి. చెంచా ఉప్పుకి, రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులను తోమండి. మునుపటిలా తిరిగి తళతళలాడటం మీరే గమనిస్తారు. అలాగే నిమ్మరసం, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి తోమినా కొత్తవాటిలా కనిపిస్తాయి.