News June 25, 2024

జగన్‌కు ఆ అర్హత లేదు: మంత్రి సంధ్యారాణి

image

AP: ప్రతిపక్ష <<13506565>>హోదా<<>>పై స్పీకర్‌కు వైసీపీ చీఫ్ జగన్ లేఖ రాయడంపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. స్పీకర్‌ ఎన్నికకు హాజరవ్వని జగన్‌కు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే రోజు జగన్ తన పేరును మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ జగన్ సభలో లేరని విమర్శించారు.

Similar News

News November 26, 2025

స్టూడెంట్స్ అసెంబ్లీ.. దద్దరిల్లుతున్న సభ

image

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ వాడివేడిగా జరుగుతోంది. విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరుపుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు వీటికి దీటుగా బదులిస్తున్నారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలు పోషిస్తున్న చిన్నారులు పంచ్ డైలాగులతో సమాధానాలు ఇస్తున్నారు. సభ పక్కదారి పట్టకుండా స్పీకర్(అమ్మాయి) అదుపు చేస్తున్నారు.

News November 26, 2025

జూన్-జులై మధ్య గోదావరి పుష్కరాలు?

image

AP: గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26-జులై 7 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వేదపండితులతో దేవదాయ శాఖ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై CM CBN త్వరలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నాయి. చివరిసారి 2015లో గోదావరి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.

News November 26, 2025

NPCILలో 122 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, PG, PG డిప్లొమా, MBA, BE, B.Tech, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, Jr ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400 చెల్లిస్తారు. npcilcareers.co.in