News April 29, 2024
జగన్‌కు సంపద సృష్టించడం తెలియదు: చంద్రబాబు

AP: ప్రజల జీవితాలను సీఎం జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నందికొట్కూరు సభలో మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు శిక్ష వేసే బాధ్యత ప్రజలదే. డ్రైవింగ్ తెలియని వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. ఆయనకు సంపద సృష్టించడం తెలియదు. వైసీపీ హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేమీ లేవు’ అని మండిపడ్డారు.
Similar News
News November 8, 2025
ఆలయాల్లో డిజిటల్ సేవలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను పెంచాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దర్శనం, సేవల టికెట్లను సులభంగా పొందేలా 100 కియోస్క్‌లను ఏర్పాటుచేయనుంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గనుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితోపాటు అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి తదితర 15 ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
News November 8, 2025
ఈ స్నాక్స్ ట్రై చేయండి

పిల్లలు స్కూల్లో, పెద్దలు ఆఫీసుల్లో తినడానికి బెస్ట్ స్నాక్స్
*వేయించిన శనగలు
*బాదాం లేదా వాల్‌నట్స్
*ఆపిల్ లేదా జామ
*డార్క్ చాక్లెట్లు
*హోం మేడ్ ప్రొటీన్ లడ్డూ
*గుమ్మడి, అవిసె, చియా సీడ్స్
*ఉడకబెట్టిన గుడ్డు
News November 8, 2025
భారత్‌ని టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

పాక్‌తో సంబంధమున్న ‘ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్‌ని టార్గెట్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ‘డెస్క్ ర్యాట్’ అనే అడ్వాన్స్డ్ స్పై వేర్‌తో ప్రభుత్వం, ఆర్మీ కంప్యూటర్స్‌ని అటాక్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత కంప్యూటర్ల ద్వారా చైనా మిలిటరీ కదలికలు చూసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాయి. నకిలీ ఈమెయిల్స్‌తో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసుకునేలా ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.


