News April 17, 2024

మోదీతో మాట్లాడే ధైర్యం జగన్‌కు లేదు: పవన్

image

AP: నరేంద్ర మోదీతో మాట్లాడే ధైర్యం జగన్‌కు లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాడట. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై చర్చ సమయంలో సోనియా గాంధీ ముందు ప్లకార్డు పట్టుకోలేని పిరికివాడివి నువ్వు. అలాంటిది మోదీతో మాట్లాడగలవా?’ అని ఫైరయ్యారు. సంపద సృష్టించడం కంటే డబ్బులు పంచడం చాలా సులభం అని పవన్ వ్యాఖ్యానించారు.

Similar News

News December 16, 2025

అమలాపురం: 21న పల్స్ పోలియో

image

ఈ నెల 21వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ దినోత్సవంగా ప్రకటించిందని జిల్లా వైద్య శాఖ అధికారి దుర్గారావు దొర తెలిపారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అమలాపురంలో మంగళవారం ఆయన కోరారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని దుర్గారావు దొర విజ్ఞప్తి చేశారు.

News December 16, 2025

32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

image

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.

News December 16, 2025

కౌలు రైతులకు ₹లక్ష వరకు పంట రుణం

image

AP: కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారు పంటలు సాగు చేసుకునేందుకు రుణాలివ్వాలని DCCBలను ఆదేశించింది. రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలి. ఎకరాకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ₹లక్ష వరకు రుణమిస్తారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. రుణాన్ని వడ్డీతో ఏడాదిలోపు చెల్లించాలి. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు రావు.