News March 30, 2024
మూకుమ్మడి రాజీనామాల పేరుతో జగన్ డ్రామాలు: షర్మిల

AP: తాము అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల అన్నారు. విజయవాడలో పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాల పేరుతో డ్రామా చేశారని దుయ్యబట్టారు. 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.
Similar News
News October 14, 2025
వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
News October 14, 2025
బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

బ్రహ్మపుత్ర నదిపై రూ.6.4 లక్షల కోట్లతో హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2047కల్లా 76 గిగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోని 12 సబ్ బేసిన్లలో 208 పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా 64.9GW పొటెన్షియల్ కెపాసిటీ, 11.1GW పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ నుంచి జనరేట్ చేయొచ్చని పేర్కొంది.
News October 14, 2025
విదేశీ విద్యపై విప్లవాత్మక నిర్ణయం

TG: విదేశీ విద్యా పథకంలో BC, SC, ST విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తూ CM రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో బీసీ విద్యార్థుల్లో లబ్ధిదారుల సంఖ్య 300కాగా ఇప్పుడు అది 700కు చేరనుంది. BC-C, Eలతో కలుపుకుంటే విద్యార్థుల సంఖ్య 1000కి చేరుతుంది. SC విద్యార్థుల సంఖ్య గతంలో 210 ఉండేది. అది ఇప్పుడు 500కు చేరనుంది. ST స్టూడెంట్స్‌లో లబ్ధిదారులు 100మంది మాత్రమే ఉండేవారు. వాళ్లిప్పుడు 200కు చేరనున్నారు.