News July 26, 2024
జగన్.. కొంచెం బూస్ట్ తాగి అసెంబ్లీకి రండి: TDP

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావాలని టీడీపీ ట్వీట్ చేసింది. ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమైన శ్వేత పత్రం(ఆర్థిక శాఖ) విడుదల కానుందని తెలిపింది. 4 రోజులుగా సభకు రాకుండా ఆయన పారిపోయారని విమర్శించింది. ఇవాళైనా బూస్ట్ తాగి, ధైర్యం తెచ్చుకుని ప్యాలెస్ నుంచి వచ్చి అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాలని కోరింది. ధైర్యంగా ఎలా రావాలో విజయసాయిరెడ్డిని అడగాలని ఏపీ పౌరులు కోరుతున్నట్లు సెటైర్లు వేసింది.
Similar News
News December 1, 2025
అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
నేడు గీతా జయంతి

పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది ఈరోజే. అందుకే నేడు గీతా జయంతి జరుపుకొంటాం. ‘ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహాభారతమే నిదర్శనం. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 1, 2025
వర్క్ స్ట్రెస్తో సంతానలేమి

పనిఒత్తిడి సంతానోత్పత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్రఒత్తిడికి గురైనప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇవి స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని, సమతుల్యతను దెబ్బతీస్తాయి. స్త్రీలలో అండాల విడుదల (ఓవ్యులేషన్) ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు.


