News January 4, 2025
జగన్ గ్యాంగ్ రూ.వందల కోట్ల అక్రమాలు చేయించింది: టీడీపీ

AP: అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ గ్యాంగ్ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమాలు చేయించిందని టీడీపీ ఆరోపించింది. రూ.వందల కోట్ల ఆస్తులను దౌర్జన్యంగా రాయించుకుందని విమర్శించింది. ఆ గ్యాంగ్ ఇప్పటికీ ఓ అధికారిని బెదిరిస్తుండటంతో అతను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు లేఖ రాశారని ట్వీట్ చేసింది. ఈ స్కామ్లో జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, పీఏ నాగేశ్వర్, భారతి బినామీ శ్రీకాంత్, నటి రీతూ చౌదరి ఉన్నారంది.
Similar News
News November 26, 2025
ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 26, 2025
RRCATలో 150 పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(<
News November 26, 2025
26/11: మానవత్వం చాటుకున్న రతన్ టాటా!

ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా ఆర్మీ అధికారులకు అందించిన సపోర్ట్ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన 3 రోజులు తాజ్ హోటల్ వెలుపలే నిలబడి సహాయక చర్యల్లో భాగమై మానవత్వాన్ని చాటారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆస్తినష్టం జరిగినా పర్లేదని ఆర్మీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, బాధితుల కుటుంబాలకు ఆయన చికిత్స అందించి ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచారు.


