News May 4, 2024

మన మేనిఫెస్టో చూశాక జగన్ భయపడ్డాడు: CBN

image

జగన్ ప్రజలకు రూ.10 ఇచ్చి, రూ.100 లాక్కున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ దోపిడీదారుడు, దోపిడీకి సామ్రాట్టు. ప్రజల భూములపై కన్ను పడింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? మన మేనిఫెస్టో చూశాక జగన్ భయపడ్డాడు. ఓటమి ఖాయమని ఆయనకు అర్థమైంది. కూటమి వచ్చాక రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తాం. ఆదాయం పెంచి పేదలకు పంచుతాం’ అని హామీ ఇచ్చారు.

Similar News

News November 24, 2025

స్మృతి పెళ్లి వాయిదా.. పలాశ్ సోదరి రిక్వెస్ట్!

image

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడేందుకు వాళ్ల ఫాదర్ ఆరోగ్య పరిస్థితి కారణమని పలాశ్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో తమ కుటుంబాల గోప్యతకు గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. నిన్న ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా పడినట్లు మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 24, 2025

వన్డేలకు రెడీ అవుతున్న హిట్‌మ్యాన్

image

ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నారు. గత 5, 6 రోజులుగా అతడు బెంగళూరు ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నారు. ఫిట్‌నెస్ పెంచుకోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో స్పెషల్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తాను జిమ్‌లో గడిపే ఫొటోలను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News November 24, 2025

హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

image

‘షోలే’ మూవీ షూటింగ్‌లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.