News January 1, 2025
తెలుగు భాషను జగన్ భ్రష్టుపట్టించారు: మండలి బుద్ధప్రసాద్
AP: మాజీ సీఎం జగన్ తెలుగు భాషను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ‘విజయవాడలో జరిగిన తెలుగు మహాసభలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయినా సరే ఆయన వాటిని తెలుగుదేశం మహాసభలంటూ నోరుపారేసుకున్నారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం జగన్కు అలవాటు. ఆయన హయాంలో తెలుగు భాషను నాశనం చేసేందుకు యత్నించారు’ అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News January 4, 2025
వినియోగదారులకు EPFO గుడ్ న్యూస్
పింఛనుదారులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకునుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 68 లక్షలమంది లబ్ధిదారులు ఈ చర్యతో మేలు పొందుతారని పేర్కొంది. ఇప్పటి వరకూ EPFO కేవలం కొన్ని బ్యాంకులతోనే అగ్రిమెంట్ ఉన్న కారణంగా పింఛనుదారులు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ భారం తప్పనుంది. ఈ నెల 1 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
News January 4, 2025
కోన్స్టస్ అందుకే బుమ్రాను రెచ్చగొట్టారేమో: పంత్
సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆఖరి ఓవర్లో భారత కెప్టెన్ బుమ్రాకు, ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్స్టాస్కు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దానిపై రిషభ్ పంత్ స్పందించారు. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు సమయం వృథా చేయాలనుకున్నారు. అందుకే కావాలని బుమ్రాను కోన్స్టార్ రెచ్చగొట్టారని అనుకుంటున్నా. అయితే, వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో నాకు వినిపించలేదు’ అని పేర్కొన్నారు.
News January 4, 2025
నేడు గోవా, కొచ్చిలో ఫ్రెంచి నేవీ విన్యాసాలు
నేడు భారత నేవీతో కలిసి ఫ్రెంచి నేవీ గోవా, కొచ్చి తీరాల్లో విన్యాసాలు చేపట్టనుంది. ఈ సంయుక్త విన్యాసాల ద్వారా ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం చేసుకోవడంతో పాటు ఇండో-పసిఫిక్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని భారత్, ఫ్రాన్స్ గుర్తుచేయనున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అణు యుద్ధ విమాన వాహక నౌక, ఫ్రిగేట్స్, అణు సబ్మెరైన్ సహా ఫ్రెంచి నేవీలోని కీలక రక్షణ ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నాయి.