News April 5, 2024

జగన్ రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారు: చంద్రబాబు

image

AP: ప్రజల జీవితాలతో ఆడుకునే జలగ జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నరసాపురం సభలో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసింది. జగన్.. జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చారు. వైసీపీ నాయకులే వాటిని అమ్ముతున్నారు. కిరాయి దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని 160 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News January 23, 2026

నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

image

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు కేటాయించేందుకు CRDA ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇ-లాటరీ ద్వారా అందజేయనుంది. మొత్తం 15 గ్రామాల్లోని 291 మందికి స్థలాలు ఇవ్వనుంది. 14 గ్రామాల రైతులకు 11AMకు, ఉండవల్లిలో మెట్టభూములిచ్చిన వారికి 3PMకు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చిన, ఉండవల్లిలో జరీబు భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు ఇవ్వనుంది.

News January 23, 2026

గ్రామ ప్రియ కోళ్ల గురించి తెలుసా?

image

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.

News January 23, 2026

జేడ్ రోలర్‌తో మెరిసే చర్మం

image

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్‌ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.