News November 15, 2024

జగన్ ఏ పథకాన్నీ ఆపలేదు: కన్నబాబు

image

AP: జగన్ హయాంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోలేదని వైసీపీ నేత కురసాల కన్నబాబు తెలిపారు. కొవిడ్ సమయంలోనూ వాటిని ప్రజలకు అందించామని చెప్పారు. ‘రాష్ట్రాన్ని జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసిందని, చంద్రబాబు ఏదో అద్భుతం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఒక్క పథకం కూడా ప్రారంభించలేదు. శాసనసభలో టీడీపీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News December 9, 2025

పుట్టగూడెం, మల్లన్నగూడెం మరోసారి ఏకగ్రీవం

image

గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాజాపేట మండలంలోని పుట్టగూడెం, మల్లన్నగూడెం గ్రామ పంచాయతీలు ఈసారి కూడా ఏకగ్రీవమయ్యాయి. పుట్టగూడెంలో 332 మంది ఓటర్లు, మల్లన్నగూడెంలో 759 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామ పెద్దలు, నాయకుల సమన్వయంతో శాంతియుతంగా ఏకగ్రీవం సాధించారు. ప్రజల ఐక్యతతో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకున్న ఈ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి.

News December 9, 2025

USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

image

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

News December 9, 2025

భారత్ బియ్యంపైనా టారిఫ్‌లకు సిద్ధమైన ట్రంప్

image

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్‌ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్‌లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.