News March 7, 2025

జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు: CM చంద్రబాబు

image

AP: వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ ముసుగులో రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్థులున్నారు. స్వలబ్ధి కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారు. ప్రజలను ఏమార్చేందుకు ఆయన చేస్తున్న అరాచకాన్ని తిప్పికొట్టాలి. వివేకా హత్య సమయంలో ముందు గుండెపోటు.. తర్వాత గొడ్డలి వేటు.. ఆపై నాపై ఆరోపణలు చేశారు. చెల్లినే నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేశారు’ అని CM అన్నారు.

Similar News

News January 25, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>హిందుస్థాన్<<>> కాపర్ లిమిటెడ్ 18పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు JAN 27 – FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(EE), ITI(ఎలక్ట్రికల్), టెన్త్, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్&రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hindustancopper.com/

News January 25, 2026

ఇవాళ సూర్య జయంతి.. ‘రథ సప్తమి’ అని ఎందుకంటారు?

image

కశ్యప మహాముని కుమారుడు సూర్యుడి జయంతి నేడు. అయితే ‘రథ సప్తమి’గా ప్రాముఖ్యం చెందింది. దానికి కారణం.. ఇవాళ ఆదిత్యుడు 7గుర్రాల రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణిస్తాడని భక్తులు నమ్ముతారు. మాఘ సప్తమి(నేడు) నుంచి 6నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపంగా సూర్యుడు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తారని విశ్వసిస్తారు.

News January 25, 2026

తిరుమల గిరుల్లో రథసప్తమి శోభ

image

AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 గంటలకే మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.