News October 14, 2024

పంచాయతీలను జగన్ నిర్వీర్యం చేశారు: నిమ్మల

image

AP: సంక్రాంతిలోపు 3వేల కి.మీల సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోరింటాడలో పల్లెపండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ నిధుల్ని దారి మళ్లించిన జగన్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి, సర్పంచులను భిక్షాటన చేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు.

Similar News

News November 27, 2025

ములుగు: సమయం లేదు మిత్రమా.. ఏం చేద్దాం..?

image

ఉత్కంఠతకు తెరదించుతూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూలు ఒకేసారి విడుదల చేసింది. ఒకరోజు వ్యవధిలోనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుండటంతో రాజకీయ పార్టీలకు ఊపిరి సలపడంలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే తర్జనభర్జన పడుతున్నారు. నామినేషన్ వేయడానికి కుల ధ్రువీకరణ, తదితర పత్రాలు అవసరం పడుతుండటంతో ఆశావహులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

image

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

News November 27, 2025

విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

image

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్‌లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.