News April 6, 2024
ప్రతీ పేదవాడి గుండెల్లో జగన్: మంత్రి గుడివాడ

ఏపీలోని ప్రతీ పేదవాడి గుండెల్లో వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో జగన్కే ఓటేయాలని అందరూ అనుకుంటున్నారు. జగన్ను సీఎం చేసేందుకు నేనేమైనా చేస్తా. సీఎం రమేశ్ నాన్ లోకల్. ఎంపీ నిధుల నుంచి ఆయన అనకాపల్లిలో రూపాయైనా ఖర్చు చేశారా? ఆయన ఇక్కడ గెలవరు. ఎన్నికల తర్వాత రమేశ్ చెవిలో పువ్వు పెట్టుకుని వెళ్లిపోవడమే’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు.
Similar News
News November 6, 2025
ఎస్బీఐ PO ఫలితాలు విడుదల

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <
News November 6, 2025
విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తాం: రామ్మోహన్

AP: ప్రపంచంలో రోజూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. <<18216721>>సైన్స్ ఎక్స్పోజర్ టూర్<<>> కోసం ఢిల్లీలో పర్యటిస్తోన్న స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News November 6, 2025
మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.


