News June 2, 2024

ఏపీలో జగనే మళ్లీ సీఎం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ఏపీ CMగా జగన్ రెండోసారి పదవి చేపట్టడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ రాష్ట్రంలోని తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్‌కే అవకాశం ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. డిచ్‌పల్లిలో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో BRSకు ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. కాగా ఈసారి AP ఓటర్ల నాడి తెలియట్లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Similar News

News September 14, 2025

గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

image

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్‌ టైప్‌-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.

News September 14, 2025

ఇవాళ అస్సాం, రేపు ప.బెంగాల్‌లో PM పర్యటన

image

PM మోదీ రాష్ట్రాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవాళ అస్సాంలో రూ.18,530 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంటును ప్రారంభిస్తారు. రేపు PM ప.బెంగాల్‌లో పర్యటిస్తారు. కోల్‌కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025లో పాల్గొంటారు. ఆ తర్వాత బిహార్ వెళ్లి పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ను ప్రారంభిస్తారు.

News September 14, 2025

గొర్రెల్లో చిటుక వ్యాధి లక్షణాలు

image

ఈ వ్యాధి బారినపడిన జీవాల్లో తొలుత లక్షణాలు ఎక్కువగా బయటకు కనిపించవు. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు విపరీతమైన జ్వరం వస్తుంది. మేత మేయకుండా గొర్రెలు నీరసపడతాయి. సరిగా నడవలేవు. నోటి నుంచి చొంగ కారుస్తూ, పళ్లు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. కొన్నిసార్లు చిటుక వ్యాధికి గురైన గొర్రె పిల్లలు చెంగున గాలిలోకి ఎగిరి, హఠాత్తుగా మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి.