News August 28, 2024

జగన్ కనీసం ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అర్హత లేని వ్యక్తి: CM

image

AP: గత ప్రభుత్వం కారణంగా ఢిల్లీలో మన అధికారులు కూడా తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ లాంటి వ్యక్తులు సమాజంలో లేకుండా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్ కనీసం ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అర్హత లేని వ్యక్తి. రాజధానిలో జగన్ చేసిన కంపు అంతాఇంతా కాదు. దాన్ని శుభ్రం చేయడానికి అమరావతిలో రూ.35 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది’ అని ఫైరయ్యారు.

Similar News

News October 17, 2025

509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే (OCT 20) సమయం ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 17, 2025

తులా సంక్రమణం అంటే ఏంటి?

image

సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అని అంటారు. ఏడాదికి ఇలాంటివి 12 సంక్రమణాలు జరుగుతాయి. అలా శుక్రవారం 1:53PMకి తులా సంక్రమణం జరగనుంది. అంటే ఆ సమయాన సూర్యుడు కన్యా నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడన్న మాట. నేటి నుంచి పగటి కాలం క్రమంగా తగ్గి, రాత్రి సమయం పెరుగుతుంది. ఈ మార్పు శరదృతువు రాకను సూచిస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆ ఫలితాల కోసం <<-se_10008>>జ్యోతిషం<<>> కేటగిరీ.

News October 17, 2025

ఆయిల్ పామ్ తోటల్లో నత్రజని లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.