News June 4, 2024
జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు: పవన్

AP: ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.
Similar News
News December 8, 2025
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.
News December 8, 2025
‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
News December 8, 2025
ఇంటి పేరు వద్దనుకున్న సమంత?

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ‘సమంత రూత్ ప్రభు’ అని ఉంది. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఆమె తన పేరు పక్కన ఎవరి ఇంటి పేరును పెట్టుకునేందుకు ఇష్టపడట్లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంటి పేరును కూడా తొలగించి కేవలం ‘సమంత’ అనే బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. కాగా అంతకుముందు సమంత అక్కినేని అని ఉండేది.


