News May 10, 2024
జగన్ భయపడుతున్నారు: పవన్ కళ్యాణ్

AP: మన హక్కులను అదిమేయాలని చూసిన జగన్ను భయపెట్టిన పార్టీ జనసేన అని పవన్ వెల్లడించారు. ‘రోడ్డు మీదకు రావడానికి, మాట్లాడటానికి జగన్ భయపడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు CMకు తెలుసు. ఆ భయం జగన్కు పరిచయం చేసింది జనసేన పార్టీనే. ఒక వీర మహిళ, ఒక జనసైనికుడు, సుగాలి ప్రీతి తల్లి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు నా వద్దకు తీసుకొస్తే వాటిని నేను ప్రశ్నించి భయపెట్టా’ అని పిఠాపురం సభలో వ్యాఖ్యానించారు.
Similar News
News January 15, 2026
BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

ముంబై మున్సిపల్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేనకు 131-151 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కూటమి 58-68, కాంగ్రెస్ 12-16 వార్డులు గెలుచుకుంటాయని పేర్కొంది. కాగా BMCలో మొత్తం 227 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, రేపు ఫలితాలు రానున్నాయి.
News January 15, 2026
షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

బ్లడ్ షుగర్ లెవల్స్ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.
News January 15, 2026
సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశువులను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది’ అని పేర్కొన్నారు.


