News August 29, 2024
YCPలో మిగిలేది జగన్ ఒక్కరే: గంటా

AP: వైసీపీ మునిగిపోయే నావ అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీలో వైఎస్ జగన్ తప్ప ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ పతనానికి జగనే ప్రధాన కారణం. ఆయన ఒంటెద్దు పోకడలతో ఆ పార్టీ నేతలు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. కానీ వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేరాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
నిరంతర ట్రాకింగ్‌కు కేంద్రం ప్రతిపాదనలు! వ్యతిరేకిస్తున్న సెల్ కంపెనీలు

శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) సిస్టమ్‌ను యాక్టివ్‌లో ఉంచడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. సెల్ టవర్ డేటా ఆధారంగా కేసులను దర్యాప్తు సంస్థలు విచారిస్తుంటాయి. దీనికి టెలికం సంస్థల డేటాపై ఆధారపడతాయి. కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాలంటే A-GPS తప్పనిసరి చేయాలని టెలికం సంస్థలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రైవసీకి భంగం కలుగుతుందని సెల్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.
News December 5, 2025
వారంలో 100 టన్నులు అమ్మేశారు..

వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు దీనిని ‘క్యాష్’ చేసుకున్నారు. ఇంట్లో ఉండే వెండిని భారీగా అమ్మేశారు. కేవలం వారంలోనే సుమారు 100 టన్నుల పాత వెండి మార్కెట్‌కు వచ్చినట్లు IBJA అంచనా వేసింది. సాధారణంగా నెలకు 10-15 టన్నులు మార్కెట్‌కు వచ్చేది. KG వెండి ధర రూ.1.90,000కు చేరుకోవడంతో లాభాల కోసం కుటుంబాలు దుకాణాలకు క్యూ కట్టాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఖర్చులు కూడా అమ్మకాలకు ఓ కారణం.
News December 5, 2025
కష్టాలకు తలొగ్గవద్దు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది: కేసీఆర్

TG: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని కార్యకర్తలకు మాజీ సీఎం KCR సూచించారు. తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచులు, వార్డు సభ్యులు ఆయనను కలిశారు. BRS అధినేత వారిని సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా KCR మాట్లాడుతూ ‘మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పల్లెలకు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అధైర్యపడకుండా ముందుకు నడవాలి’ అని చెప్పారు.


