News April 7, 2025
జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు.. వైసీపీ ట్వీట్లు

AP: తమ పార్టీ అధినేత జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ వైసీపీ వరుస ట్వీట్లు చేస్తోంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించారని పేర్కొంది. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేసింది. విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలకు తిరిగి శంకుస్థాపన చేశారని తెలిపింది.
Similar News
News October 22, 2025
2,570 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

2,570 ఇంజినీరింగ్ పోస్టులకు RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈ నెల 31న రిలీజ్ కానుంది. వెబ్సైట్: <
News October 22, 2025
జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి..

TG: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిశారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా SMలో దుష్ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ స్పష్టం చేశారు.
News October 22, 2025
వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.