News November 14, 2024

జగన్ ఆ ఛాన్స్ కోల్పోయారు: మంత్రి సత్యకుమార్

image

AP: రఘురామకృష్ణం రాజు ఉపసభాపతిగా ఉంటే రాష్ట్రానికి పట్టిన కీడు తొలగిపోతుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆయన ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలన్న కోరిక దుష్ట శక్తుల్లో చచ్చిపోతుందని చెప్పారు. ‘అసెంబ్లీకి వస్తుంటే ఎవరు ఏమడుగుతారోనని స్కూల్‌కి వస్తున్నభావన ఉంది. YCP సభ్యులకు అలా అనిపించటం లేదు. ముందే వారు సభకు మొహం చాటేశారు. RRRను అధ్యక్షా అని పిలిచే అవకాశాన్ని జగన్ కోల్పోయారు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 15, 2024

రంగులు మారే శివలింగం ఎక్కడుందంటే?

image

తమిళనాడు రాష్ట్రం అతిపురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ సైన్స్‌కు చిక్కని ఎన్నో రహస్యాలు, సంపదలున్న ఆలయాలున్నాయి. ఇందులో తిరునళ్లూరులో ఉండే శ్రీ పంచ వర్ణేశ్వరాలయం ఒకటి. ఇక్కడున్న శివలింగం ఒక్క రోజులోనే 5 రకాల రంగుల్లో మారుతుంటుంది. లింగాన్ని రాగి, పింక్, గోల్డెన్, ఆకుపచ్చ, అనౌన్ కలర్‌లో చూడొచ్చు. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే కైలాసగిరి ప్రదక్షిణం చేసినట్లేనట.

News November 15, 2024

మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమే!

image

ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాల్సిందే. అయితే, తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో తెలుసా? 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రంజనా సోనావానే అనే మహిళకు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. కాగా, భారత తొలి ఫైవ్ స్టార్ హోటల్ ముంబై తాజ్ హోటల్. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ట్రైన్, ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ IIT రూర్కీ కావడం విశేషం.

News November 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 15, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:06
✒ సూర్యోదయం: ఉదయం 6:21
✒ దుహర్: మధ్యాహ్నం 12:01
✒ అసర్: సాయంత్రం 4:04
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:40
✒ ఇష: రాత్రి 6.55
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.