News March 17, 2024

జగన్ ఏపీని చీకటిమయం చేశారు: చంద్రబాబు

image

AP: తన విధ్వంస పాలనతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు. వైసీపీకి ఓటేయవద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే.. ప్రజలు అర్థం చేసుకోవాలి. పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు, ఉపాధి లేదు. రోడ్లు లేవు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారు’ అని విమర్శలు చేశారు.

Similar News

News October 30, 2024

మయోనైజ్‌పై ప్రభుత్వం నిషేధం

image

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది అనారోగ్యాలకు కారణం అవుతున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మయోనైజ్‌ను వినియోగించకుండా హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. కాగా మయోనైజ్ తిని ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

News October 30, 2024

SPFకు సచివాలయ భద్రత

image

TG: రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యతను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)కు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) విధులు నిర్వహించింది. పాత సచివాలయంలో 25 ఏళ్లుగా SPF సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అప్పటి BRS సర్కార్ TGSPని నియమించింది. అయితే ఇటీవల బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వారిని తొలగించినట్లు తెలుస్తోంది.

News October 30, 2024

హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట

image

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హర్షసాయి పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా హర్షసాయి తన దగ్గర రూ.2 కోట్లు తీసుకోవడమే కాకుండా లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్ష పరారీలోనే ఉన్నారు.