News October 10, 2024
దుర్గాదేవి అలంకారంలో జగన్మాత

AP: దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై జగన్మాత నేడు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దుర్గముడనే రాక్షసుడ్ని సంహారం చేసిన శక్తి స్వరూపిణే దుర్గాదేవి. ఈరోజు అమ్మను దర్శించుకుంటే గ్రహ బాధలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు సిబ్బంది అన్నపానీయాలు అందిస్తున్నారు.
Similar News
News July 9, 2025
జులై 9: చరిత్రలో ఈరోజు

1875: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం(ఫొటోలో)
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం (ఫొటోలో)
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం
News July 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 9, 2025
విశాఖలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్

AP: రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరులో మంత్రి లోకేశ్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత ఆసంస్థ 30ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. ANSR సంస్థ కూడా విశాఖలో GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.