News July 4, 2024

నేడు పిన్నెల్లితో జగన్ ములాఖత్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరు వెళ్లనున్నారు. సెంట్రల్‌ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆయన ములాఖత్ అవుతారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్‌, కారంపూడి సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 16, 2025

కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

News January 16, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

News January 16, 2025

‘ముక్కనుమ’ గురించి తెలుసా?

image

సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు