News September 25, 2024

ఈ నెల 28న తిరుమలకు కాలినడకన జగన్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News September 25, 2024

రూ.11కే ఐఫోన్ 13.. ఫ్లిప్‌కార్ట్ ఏమందంటే?

image

ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆఫర్ కింద తక్కువ ధరకే మొబైల్స్ విక్రయిస్తున్నామన్న ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై కస్టమర్లు మండిపడుతున్నారు. రాత్రి 11 గం.కు ఐఫోన్ 13ను రూ.11కే అమ్ముతున్నామంటూ సైట్‌లో పెట్టారని, కానీ ప్రతిసారి సోల్డ్ ఔట్, ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపించిందని ఫైరవుతున్నారు. అయితే ఆఫర్ తొలి ముగ్గురికే అందుతుందని బిగ్ బిలియన్ డేస్‌లో రా.9, 11 గంటలకు మరిన్ని ఆఫర్స్ అందుకోవచ్చని కంపెనీ రిప్లై ఇచ్చింది.

News September 25, 2024

ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

TG: HYD హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు <>https://iti.telangana.gov.in<<>> లో అప్లై చేసుకోవాలని సూచించారు.

News September 25, 2024

కాలుష్య నివారణకు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు!

image

న‌వంబ‌ర్ నెల‌లో తీవ్ర స్థాయిలో ఉండే కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి కృత్రిమ‌ వ‌ర్షాల సృష్టికి ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. న‌వంబ‌ర్ 1 నుంచి 15 తేదీల మ‌ధ్య వర్షాల సృష్టికి అనుమ‌తుల కోసం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు లేఖ రాసిన‌ట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 21 పాయింట్ల అజెండాతో కాలుష్య నివార‌ణ‌కు యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేశామ‌ని, ప్ర‌త్యేక బృందాలు, యంత్రాల‌ను మోహ‌రించ‌నున్న‌ట్టు వివరించారు.