News November 30, 2024
విద్యుత్‌పై జగన్ రూ.లక్ష కోట్ల అప్పు: మంత్రి గొట్టిపాటి

AP: సెకీతో తక్కువ ధరకు విద్యుత్ ఒప్పందం చేసుకున్నందుకు తనకు శాలువాలు కప్పాలన్న YS జగన్ వ్యాఖ్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు సన్మానం చేయాలా? అని ప్రశ్నించారు. ఆయన పాలన వల్ల రాష్ట్రం 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని విమర్శించారు. విద్యుత్ వ్యవస్థలపై ₹లక్ష కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. జగన్ అవినీతి నాడు రాష్ట్రం, నేడు దేశం దాటిపోయిందని దుయ్యబట్టారు.
Similar News
News October 29, 2025
మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఇందుకే!

తాను పనిచేస్తుంటే హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్న భర్తను చూసి మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఉద్యోగం కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని తేలింది. ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణతో మహిళల్లో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. ఇది సోమరితనం కాదని, బాధ్యతల్లో అసమతుల్యత అని నిపుణులు చెబుతున్నారు. *ఇంట్లో భార్యకు హెల్ప్ చేయండి బాస్
News October 29, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<
News October 29, 2025
ఇంటి చిట్కాలు

* ఓవెన్‌ని క్లీన్ చేయడానికి ఒక బౌల్లో నిమ్మ ముక్కల్ని వేసి ఓవెన్లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక తడి క్లాత్‌తో ఓవెన్‌ని తుడిస్తే సరిపోతుంది.
* గ్లాస్ ఓవెన్ డోర్‌పై బేకింగ్ సోడా-నీళ్లు కలిపి రాసి పొడి క్లాత్‌తో తుడిస్తే మరకలు వదిలిపోతాయి.
* కిచెన్ సింక్, వాష్‌బేసిన్లపై పడే మరకలపై టూత్‌పేస్ట్ పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే మరకలు సులభంగా వదిలిపోతాయి.


