News July 7, 2024

నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

Similar News

News April 3, 2026

కవిత తన పార్టీకి TRS పేరు పెడతారా?

image

TG: కొత్త పార్టీ పెట్టనున్న వేళ HYD ప్రెస్‌‌మీట్లో జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. TRS పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. తాము పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని తెలిపారు. దీంతో తన పార్టీకి TRS పేరు పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పటికే కవిత పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.

News April 3, 2026

చద్దాను సైలెంట్ చేయడానికి కారణాలివేనా?

image

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తప్పించడానికి బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీ విషయాలపై ఆయన మౌనం వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ నిర్దోషి అని తేలాక జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అలాగే పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్యసభలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆప్ వర్గాలు ఆరోపించాయి.

News April 3, 2026

అమరావతిపై 2-3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి హోం శాఖకు ఈ బిల్లు ప్రతులు చేరాయి. బిల్లును హోంశాఖ 2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టంగా మారుతుంది. ఆపై కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధ రాజధాని కానుంది.