News June 27, 2024
జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం అన్నారు: మాజీ సీఎస్

AP: YS జగన్‌పై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం సంచలన వ్యాఖ్యలు చేశారని TDP ట్వీట్ చేసింది. ‘CMగా ఉన్నప్పుడు జగన్ భయంకరమైన ఆలోచనలు చేసేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం అన్నారు. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను’ అంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. కాగా సీఎస్‌గా ఉన్న సమయంలోనే సుబ్రహ్మణ్యంను YCP ప్రభుత్వం బదిలీ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.
Similar News
News January 23, 2026
న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

T20 WCకు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమయ్యారు. SA20లో ఆడుతుండగా ఎడమ తొడ కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను NZ రీప్లేస్ చేసింది. ఓరూర్కీ, టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సీర్స్ ఇప్పటికే గాయపడ్డారు. ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ పెటర్నిటీ లీవ్స్ కారణంగా WCలో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశముంది.
News January 23, 2026
మరణం లేని యోధుడు నేతాజీ!

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటుచేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఇవాళ నేతాజీ జయంతి.
News January 23, 2026
నారా లోకేశ్‌కు Jr.NTR బర్త్‌డే విషెస్

AP: మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది లోకేశ్‌కు అద్భుతంగా సాగాలని హీరో Jr.NTR ఆకాంక్షించారు. ఆయనకు మరింత శక్తి, సుఖసంతోషాలు కలగాలని Dy.CM పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నేత అంటూ హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రముఖులు లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.


