News April 27, 2024
ఎస్సీ, ఎస్టీలకు జగన్ క్షమాపణ చెప్పాలి: షర్మిల

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ‘వైసీపీ పాలనలో బడుగుల జీవితాలు అధ్వానంగా మారాయి. వారి నిధులు దారి మళ్లించి ఉప ప్రణాళికను మంటగలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 28 పథకాలను తుంగలో తొక్కారు. వైసీపీ నేతలే ఎస్సీ, ఎస్టీలను దారుణంగా అణచివేస్తున్నారు. అందుకే వారికి జరిగిన అన్యాయానికి జగన్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
గ్రామ పంచాయతీలకు శుభవార్త

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.
News November 12, 2025
పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 12, 2025
ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


