News September 26, 2024

డిక్లరేషన్ ఇచ్చాకే జగన్ దర్శనానికి వెళ్లాలి: పురందీశ్వరి

image

AP: టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వైసీపీ చీఫ్ జగన్ వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. జగన్ అన్యమతస్థుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలన్నారు. కాగా ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో జగన్ తిరుమల వెళ్లనున్నారు.

Similar News

News December 12, 2025

కోల్డ్ వాటర్ థెరపీతో ఎన్నో లాభాలు

image

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్, ఫైటింగ్ కెమికల్స్ విడుదలవుతాయి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల డోపమైన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ‘ఫీల్ గుడ్’ హార్మోన్. ఇది తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

News December 12, 2025

నేడు మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

image

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాతలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. క్వింటాకు రూ.2,400 చొప్పున అందజేయనుంది. కాగా కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని తామే పంటను సేకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

News December 12, 2025

నితీశ్ హ్యాట్రిక్

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టారు. ఆంధ్రా జట్టుకు ఆడుతున్న ఆయన మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశారు. మూడో ఓవర్ 4, 5, 6 బంతులకు వరుసగా హర్ష్, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌లను పెవిలియన్‌కు పంపించారు. కాగా తొలుత ఆంధ్రా 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ ఆటగాళ్లు తడబడుతున్నారు.