News June 18, 2024
జగన్ రాజీనామా చేయాలి: బుద్ధా వెంకన్న

AP: ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించాలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ‘మీకు 151 సీట్లు వచ్చినప్పుడు మీ విజయమా? మాకు 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా? జగన్.. పులివెందులకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు రండి. బ్యాలెట్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరదాం. మీకు కనీసం మొన్న వచ్చిన మెజారిటీ వస్తుందేమో చూద్దాం. ఇకనైనా చిలక జోస్యం ఆపండి’ అని సూచించారు.
Similar News
News April 2, 2026
పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తున్నారా?

పిల్లలు త్వరగా నడవాలని చాలామంది పేరెంట్స్ బేబీ వాకర్‌లో ఎక్కువసేపు కూర్చోబెడతారు. కానీ దీనివల్ల లాభాల కంటే.. నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎక్కువగా బేబీవాకర్‌లో ఉండటం వల్ల చిన్నారుల వెన్నెముక వంకరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు దూరంగా పెట్టి నడవడం అలవాటవుతుంది. బిడ్డ తనంతట తానుగా లేచి నడిస్తే మంచి సమతుల్యత ఉంటుంది. కాబట్టి వాకర్స్ వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు.
News April 2, 2026
IPLలో నా ఫేవరెట్ కెప్టెన్ అతడే: పాటీదార్

IPLలో తన ఫేవరెట్ ప్లేయర్లు ఎవరో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ వెల్లడించారు. రోహిత్ శర్మ తన అభిమాన కెప్టెన్ అని తెలిపారు.
*బ్యాటర్: విరాట్ కోహ్లీ *కెప్టెన్: రోహిత్ శర్మ *ఫీల్డర్: డుప్లెసిస్ *ఫాస్ట్ బౌలర్: డేల్ స్టెయిన్ *స్పిన్నర్: సునీల్ నరైన్ *ఫినిషర్: ఏబీ డివిలియర్స్ *డెత్ ఓవర్ బౌలర్: బుమ్రా *కవర్ డ్రైవ్: విరాట్ కోహ్లీ.
News April 2, 2026
ఆవిరి పట్టడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

వారానికోసారి ముఖానికి ఆవిరి పట్టిస్తే మెరిసే మోము సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ఆవిరి పట్టడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మృతకణాలు సులువుగా వచ్చేస్తాయి. దీంతో మొటిమల బాధ తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల రక్తప్రసరణ పెరిగి కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం యవ్వనంగా మారుతుంది. కానీ ఎక్కువసేపు ఆవిరి పట్టడం వల్ల సహజ నూనెలు తగ్గి ముడతలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


