News July 22, 2024
అదే నాటకాన్ని జగన్ మొదలుపెట్టారు: CBN

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే కఠినంగా శిక్షిద్దామని కూటమి నేతల సమావేశంలో చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామన్నారు. వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే వినుకొండ వ్యవహారంలోనూ జగన్ మొదలుపెట్టారని విమర్శించారు. తప్పులు చేయడం, పక్కవారిపై నెట్టేయడం ఆయనకు అలవాటని దుయ్యబట్టారు.
Similar News
News September 15, 2025
15 శాతం వృద్ధిరేటు సాధనే ధ్యేయం: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ-4ను తీసుకువచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 15, 2025
పత్తిలో కలుపు నివారణకు ఇలా చేయండి

* పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
* ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి.
* వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.
News September 15, 2025
విషాదం.. సెలవు అడిగిన 10 నిమిషాలకే

‘ఆరోగ్యం బాలేదు, సెలవు కావాలి’ అని అడిగిన 10 నిమిషాలకే ఓ ఉద్యోగి గుండె ఆగి మరణించాడు. ‘శంకర్(40) అనే కొలీగ్ సిక్ లీవ్ ఇవ్వాలని ఉ.8.37 గం.కు మెసేజ్ పెట్టగా, 8.47కు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలిసి షాకయ్యాను. శంకర్‌కు ఎలాంటి దురలవాట్లు లేవు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం’ అని అతడి పై అధికారి అయ్యర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ? అనేది తెలియాల్సి ఉంది.