News August 24, 2024
జగన్.. ప్రజలు ఇస్తేనే హోదా వస్తుంది: చంద్రబాబు

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇవ్వకపోయినా జగన్ హోదా కోసం బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘జగన్.. హోదా, గౌరవం అనేవి నేరాలు, బెదిరింపులతో రావు. వాటిని ప్రజలు ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అందుకోసం కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 31, 2025
‘సెరమా’.. కోడి చిన్నదైనా ధరలో తగ్గేదే లే..

ఈ సెరమా జాతి కోళ్లు మలేషియాలో కనిపిస్తాయి. ఇవి ఆకారంలో చిన్నవిగా, తక్కువ బరువు ఉంటాయి. వీటి శరీర ఆకృతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి నిటారుగా నిలబడి, ఛాతిని ముందుకు ఉంచి, తోకను పైకి పెట్టి గంభీరంగా కనిపిస్తాయి. ఇవి మనుషులతో త్వరగా కలిసిపోతాయి. వీటిని చాలామంది పెంపుడు పక్షులుగా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీటి ధర కేజీ సుమారు రూ.85 వేలుగా ఉంటుంది.
News December 31, 2025
నిమ్మకాయ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి?

నిమ్మకాయ దీపాలను గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ వంటి శక్తి స్వరూపిణుల ఆలయాలలో మాత్రమే వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి వంటి శాంతమూర్తుల సన్నిధిలో, ఇతర దేవాలయాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు. ఇంట్లోని పూజా గదిలో కూడా వీటిని నిషిద్ధంగా భావిస్తారు. కేవలం ఉగ్రరూపం కలిగిన దేవతా మూర్తుల వద్ద మాత్రమే నియమబద్ధంగా వెలిగించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.
News December 31, 2025
ప్రపంచం మనల్ని ఆశతో చూస్తోంది: మోదీ

భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ ఎక్కిందని PM మోదీ పేర్కొన్నారు. ప్రపంచం మనల్ని ఆశ, విశ్వాసంతో చూస్తోందని చెప్పారు. ‘ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ముందుకు సాగింది. ప్రజలు గౌరవంతో బతికేందుకు, ఆంత్రప్రెన్యూర్స్ ఆవిష్కరణలు చేయడానికి, కంపెనీలు స్పష్టతతో పని చేయడానికి సంస్కరణలు ఉపయోగపడ్డాయి’ అని లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. GST, కార్మిక చట్టాలు, ఉపాధి చట్టం, బీమా కంపెనీల్లో 100% FDI వంటి వాటిని ప్రస్తావించారు.


