News September 13, 2025
జగన్.. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపండి: సత్యకుమార్

AP: మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని YS జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. 17 కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధమన్నారు. రూ.8,450 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి, రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు. జగన్‌లా తాము విఫలం కావొద్దని PPPని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. పీపీపీకి, ప్రైవేటీకరణకు తేడా ఉందని చెప్పారు.
Similar News
News March 23, 2026
HYD: అసెంబ్లీ ముట్టడికి వచ్చిన BJP చీఫ్ అరెస్ట్

బీజేపీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలో వచ్చిన ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 6 గ్యారెంటీల అమలు డిమాండ్‌తో బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరిగా వెళ్లగా ఉద్రిక్తత ఏర్పడింది. రామచందర్‌రావుతో పాటు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 23, 2026
మూసీ ప్రక్షాళనపై సలహాలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

TG: మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘గుజరాత్‌లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించింది. HYDలో మూసీ అభివృద్ధికి రాజకీయ రంగు ఎందుకు? అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాం. నాకు చెప్పడానికి ఇబ్బందైతే మంత్రులతో కమిటీ వేస్తా. వాళ్లకైనా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని సూచించారు.
News March 23, 2026
సంచలనం.. ఇకపై సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్?

గ్యాస్ సరఫరాలో సమస్యలతో రీఫిల్లింగ్ సైజ్‌ను తగ్గించాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యోచిస్తున్నట్లు ToI వెల్లడించింది. 14.2KGల సిలిండర్లలో 10KGల గ్యాస్‌నే(రేటు తగ్గించి) అందించే అవకాశం ఉందని తెలిపింది. ‘చిన్న ఫ్యామిలీకి 14.2KGల సిలిండర్ 35-40 రోజులు వస్తుంది. 10 కేజీలైతే నెలపాటు సరిపోతుంది. దీనివల్ల కొరత రాదు. ఈ సమయంలో కంపెనీలు నిల్వలను పెంచుకునే వీలుంటుంది’ అని ఓ అధికారి చెప్పినట్లు పేర్కొంది.


