News June 18, 2024

ఏపీ ఎలాన్ మస్క్‌లా జగన్ తీరు: సోమిరెడ్డి

image

AP: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న <<13460880>>జగన్<<>> విజ్ఞప్తిపై మాజీ మంత్రి, TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ‘జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. AP ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప. ఓడితే EVMల తప్పా? 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు EVMల గురించి తానేం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని సూచించారు.

Similar News

News March 18, 2026

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.

News March 18, 2026

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది.

News March 18, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.