News May 26, 2024

జగన్ ప్రమాణ స్వీకారం టైమ్ ఫిక్స్: YCP

image

AP ఎన్నికల్లో 2019కి మించి భారీ విజయం సాధిస్తామని వైసీపీ మరోసారి ధీమా వ్యక్తం చేసింది. జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాలకు విశాఖ వేదికగా జగన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు ట్విటర్ వేదికగా పిలుపునిచ్చింది. జూన్ 4న చరిత్ర తిరగరాసే ఫలితాలను జగన్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలని కోరుతూ Xలో ఓ ఫొటోను పంచుకుంది.

Similar News

News December 5, 2025

అసలేంటీ భారత్ ఫ్యూచర్ సిటీ?

image

TG టౌన్ ప్లానింగ్, ఆర్థికాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచే ఒక సాహసోపేతమైన అధ్యాయమే ఫ్యూచర్ సిటీ. ఫార్మా సిటీ, RRR, IT కారిడార్ల మధ్య వ్యూహాత్మకంగా 30K ఎకరాల విస్తీర్ణంలో నూతన నగరాన్ని(BFC) నిర్మించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గమనం, జీవన ప్రమాణాలను సమూలంగా మార్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ సిటీలో ‘వాక్ టు వర్క్’ అనే విప్లవాత్మక కాన్సెప్ట్‌ హైలైట్‌ కానుంది.

News December 5, 2025

మాలధారణలో ఉన్నప్పుడు బంధువులు మరణిస్తే..?

image

అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రక్తసంబంధీకులు మరణిస్తే వెంటనే మాల విసర్జన చేయాలి. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువు అయినందున గురుస్వామి వద్ద ఆ మాలను తీసివేయాలి. ఈ నియమం పాటించిన తర్వాత ఓ ఏడాది వరకు మాల ధరించకూడదు. అయితే దూరపు బంధువులు, మిత్రులు మరణిస్తే, మాలధారులకు ఎలాంటి దోషం ఉండదు. వారు మరణించినవారిని తలచుకొని, స్నానం చేసి స్వామిని ప్రార్థిస్తే సరిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>

News December 5, 2025

వారికి కూడా చీరలు.. సీఎం కీలక ప్రకటన

image

TG: 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను అందించే బాధ్యత మంత్రులు సీతక్క, సురేఖకు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ చెప్పారు. ‘ప్రస్తుతం 65L చీరలు పంపిణీ చేశాం. ఇంకా 35L చీరలు రావాలి. ఎన్నికల కోడ్‌తో ఆగిన చోట్ల, పట్టణ ప్రాంతాల మహిళలకూ MAR 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు ఇస్తాం’ అని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు, వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రస్తుతం చీరలు ఇస్తున్న విషయం తెలిసిందే.