News July 6, 2024
జగన్.. నీ చెల్లి పంపిన అద్దంలో ఓ సారి ముఖం చూసుకో: TDP

YCPకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారన్న జగన్ <<13576740>>ఆరోపణలపై<<>> TDP మండిపడింది. ‘జగన్ మాటలకు బాబాయ్ వివేకానంద రెడ్డి ఉలిక్కిపడ్డాడు. గొడ్డలి వేట్ల గాయాలు ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఒరిజినల్ YSR అభిమానులు, జగన్ నకిలీ ఫ్యాన్స్.. వారిలో వారే కొట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. TDPని హెచ్చరించే ముందు ఓ సారి నీ చెల్లి పంపించిన అద్దంలో ముఖం చూసుకో జగన్’ అని ట్వీట్ చేసింది.
Similar News
News November 23, 2025
సిరిసిల్ల: విధేయతకు పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం

1982లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన సంగీతం శ్రీనివాస్ 44ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఈయన ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, OBC రాష్ట్ర కమిటీ, PCC సభ్యుడిగా పని చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా సేవలందించారు. 10 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, రాజన్న సిరిసిల్ల DCC అధ్యక్షుడు అయ్యారు.
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.


