News July 27, 2024

జగన్.. అందుకే మీ ధర్నాకు దూరం: షర్మిల

image

AP: ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదనే జగన్ ప్రశ్నకు షర్మిల ఘాటుగా స్పందించారు. ‘మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యను రాజకీయం చేసినందుకా?’ అని ఆమె ప్రశ్నించారు. YCP నిరసనలో స్వలాభం తప్ప, నిజం లేదన్నారు. ఆ ధర్నాతో రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసి కాంగ్రెస్ దూరంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News January 4, 2026

మేడారం జాతర.. టోల్ ‘ఫ్రీ’ పరిశీలిస్తున్నామన్న కోమటిరెడ్డి

image

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ‘సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News January 4, 2026

ఫైరింగ్‌ నేర్చుకుని భార్యను కాల్చి చంపిన టెకీ

image

బెంగళూరులోని బసవేశ్వరలో గతనెల 24న జరిగిన బ్యాంకు మహిళా ఉద్యోగి హత్యకేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భార్య భువనేశ్వరిని చంపమని భర్త బాలమురుగన్ మొదట TNకు చెందిన వ్యక్తికి రూ.1.25లక్షలు సుపారీ ఇచ్చాడు. అతను చంపలేదని స్వయంగా తానే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బిహార్ వెళ్లి రూ.50 వేలకు గన్ కొన్నాడు. అక్కడే 15 రోజులు గన్ కాల్చడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు.

News January 4, 2026

ఫోర్బ్స్ ’40 అండర్ 40’లో ఏకైక భారతీయుడు

image

ప్రపంచ వ్యాప్తంగా యువ బిలియనీర్లను గుర్తించే ఫోర్బ్స్ ‘40 అండర్ 40’లో ఈసారి నలుగురు భారత సంతతి వ్యాపారవేత్తలకు చోటు లభించింది. ఇందులో భారత్ నుంచి ఏకైక బిలియనీర్‌గా జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ నిలిచారు. 39 ఏళ్ల నిఖిల్ నెట్‌వర్త్ $3.3Bగా ఉంది. ఈ లిస్ట్‌లో AI స్టార్టప్ మెర్కోర్‌ను స్థాపించిన ఆదర్శ్ హిరేమత్, సూర్య మిద్దా కూడా ఉన్నారు. ఈ జాబితాలో వీళ్లే అతి చిన్న వయస్కులైన (22 ఏళ్లు) బిలియనీర్లు.