News June 16, 2024

ఫర్నిచర్ దొంగ జగన్: మంత్రి అనగాని

image

AP: ప్రభుత్వ ఫర్నిచర్‌ను జగన్ వాడుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘జగన్ ఫర్నిచర్ దొంగ. ఆయనకు నైతికత ఉంటే ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. సరెండర్ చేయకుండా YCP నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. ₹50 కోట్ల CMO డబ్బుతో తాడేపల్లి, లోటస్‌పాండ్లలోని ఇళ్లలోకి ఫర్నిచర్, ఇతర వసతులను జగన్ అమర్చుకున్నారు. గతంలో కోడెలకు జగన్ చేసిందే ఈరోజు ఆయనకు తిరిగి వచ్చింది’ అని మంత్రి విమర్శించారు.

Similar News

News March 30, 2026

నేడు 2.50లక్షల మందికి ఇళ్ల పంపిణీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించనుంది. తిరుపతి జిల్లా పుదూరులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని గృహప్రవేశాలు చేయించనున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 5.50లక్షలకు చేరనుందని ప్రభుత్వం తెలిపింది. 2025 నవంబరు 12న తొలి విడత కింద 3లక్షల ఇళ్లను అందించింది.

News March 30, 2026

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ₹10వేల కోట్లు ఆదా: TGSRTC

image

TG: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు ఆదా అయిన ఛార్జీల మొత్తం ₹10వేల కోట్లకు చేరినట్లు TGSRTC ప్రకటించింది. దాదాపు 290కోట్లకుపైన జీరో టికెట్‌ను మహిళలు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య 40% నుంచి 67%కు పెరిగిందని వెల్లడించింది. ఒకప్పుడు రవాణా ఛార్జీలపై మహిళలు సగటున ₹1500-2500 వెచ్చించేవారని.. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని పేర్కొంది.

News March 30, 2026

నేడు RR vs CSK

image

ఐపీఎల్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది. అస్సాంలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్‌కు గత ఏడాది మొదటి మూడు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్ ఈసారి ఆ జట్టుకు పూర్తిగా సారథ్యం వహిస్తారు. మరోవైపు CSKకు రుతురాజ్ సారథ్యం కొనసాగిస్తారు. ఇప్పటివరకు ఈ జట్లు 31సార్లు తలపడగా CSK 16, RR 15సార్లు గెలిచింది. ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.