News November 14, 2024

జగన్.. మీకూ, మాకూ తేడా లేదు: షర్మిల

image

APలో ప్రభావం చూపలేని కాంగ్రెస్ గురించి చర్చ <<14602051>>అనవసరమన్న <<>>జగన్ వ్యాఖ్యలపై PCC చీఫ్ షర్మిల స్పందించారు. ‘బడ్జెట్ బాగోలేదని జగన్‌ కంటే ముందే చెప్పాం. 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు వాళ్లకు, మాకు తేడా లేదు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు.

Similar News

News December 21, 2025

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మంది మృతి

image

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.

News December 21, 2025

‘ఘోస్ట్’ స్కూల్స్.. టాప్‌లో బెంగాల్, TG!

image

మన దేశంలో 5,149 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క స్టూడెంట్ కూడా లేకుండా ‘ఘోస్ట్ స్కూల్స్’గా మారాయి. ఇలాంటి 70% స్కూల్స్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. TGలోని అన్ని జిల్లాల్లోనూ జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూల్స్ ఉండటం ఆందోళనకరం. ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు, పట్టణ ప్రాంతాలకు వలస, ప్రభుత్వాల ప్రణాళికా లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు లేకపోయినా బడ్జెట్ మాత్రం కేటాయిస్తున్నారు.

News December 21, 2025

కుంభమేళా ‘మోనాలిసా’.. క్రేజ్ తగ్గేదేలే

image

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే సినిమాల్లో పలు అవకాశాలు దక్కించుకున్న ఆమె షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్లకూ గెస్ట్‌గా హాజరవుతున్నారు. తాజాగా HYDలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ‘లైఫ్’ అనే తెలుగు మూవీలోనూ ఇటీవల ఆమెకు నటించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్‌ వీడియోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.