News February 18, 2025
నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 20, 2025
కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమే: ఉత్తమ్

TG: నీటి పారుదల రంగాన్ని నాశనం చేసిన ఘనత BRSదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ దుయ్యబట్టారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని, జేబులు నింపుకొనేందుకే నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమేనన్నారు. మరోవైపు రాష్ట్రంలోని జల అవసరాలపై కేంద్రంతో చర్చించామని ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణ జలాల్లో AP దోపిడీని కేంద్రానికి వివరించామని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరామని చెప్పారు.
News February 20, 2025
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న త్రివిక్రమ్ కుమారుడు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, యాక్టింగ్ వైపు కాకుండా తండ్రి బాటలోనే డైరెక్టర్గా మారేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దగ్గర శిక్షణ తీసుకుంటుండగా త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్లో జాయిన్ అవుతారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 20, 2025
మోదీని ఓడించేందుకే బైడెన్ కుట్ర: BJP నేతలు

PM మోదీని ఓడించేందుకే జోబైడెన్ USAID నిధులు భారత్కు కేటాయించారని BJP నేతలు టామ్ వడక్కన్, మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. వివిధ NGOలకు విరాళాలు ఇచ్చి ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటింగ్ శాతం పెరిగేందుకు ప్రయత్నించారని తెలిపారు. USAIDను కాంగ్రెస్ ప్రశంసించిందని, ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరడాన్ని గుర్తుచేశారు. డబ్బు ముట్టిన, కుట్ర చేసిన వారి పేర్లు వెల్లడించాలని డొనాల్డ్ ట్రంప్ను కోరారు.