News April 1, 2025
రేపు వైసీపీ నేతలతో జగన్ భేటీ

AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన MPP, జడ్పీ ఉపఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో YCP అధినేత జగన్ భేటీ కానున్నారు. పార్టీ విజయం కోసం సహకరించిన వారిని స్వయంగా అభినందించనున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కేసులతో కూటమి ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం వీరంతా అంకితభావంతో పనిచేశారని YCP నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల MPTC, ZPTCలు, పార్టీ మండల అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.
Similar News
News January 30, 2026
అల్లు అర్జున్-లోకేశ్ సినిమాలో శ్రద్ధా కపూర్?

తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీవర్గాలు వెల్లడించాయి. డైరెక్టర్ ఆమెను సంప్రదించి స్టోరీ వినిపించినట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. కాగా బన్ని ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అందులో దీపికా పదుకొనె నటిస్తున్నారు.
News January 30, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 30, 2026
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు TTD ప్రకటించింది. గ్రహణం మ.3.20 గంటలకు ప్రారంభమై సా.6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6hrs ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని 9am నుంచి 7.30pm వరకు మూసివేయనున్నారు. 7.30pmకి ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. 8:30pm నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.


