News June 22, 2024
నేడు పులివెందులకు జగన్

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరుతారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ పులివెందుల పర్యటనతో ఇవాళ వైసీపీ స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది.
Similar News
News February 17, 2026
సర్టిఫికెట్ల పరిశీలనకు DEOకు లేఖ: CDPO

అంగన్వాడీ ఉద్యోగాలకు అభ్యర్థులు సమర్పించిన టెన్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలంటూ DEOకు లేఖ రాసినట్లు కుప్పం CDPO చంద్రకళ తెలిపారు. అయితే, కలెక్టర్ ద్వారా ఆదేశాలు రావాలని DEO చెప్పడంతో కడ PD ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్టిఫికెట్లు ఒరిజినల్ Or ఫేక్ అన్నది విద్యాశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. కుప్పంలో 10th ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వారిని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.
News February 17, 2026
హీరో తండ్రి కన్నుమూత

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పని చేశారు.
News February 17, 2026
AI వల్ల ఉద్యోగాలు పోవు.. స్కిల్స్ పెంచుకోవడమే మార్గం: మోదీ

AI వల్ల ఉద్యోగాలు పోవని, మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడమే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత మనుషులను తొలగించబోదని, సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్తరకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అందుకే ప్రభుత్వం రీ-స్కిల్లింగ్‌పై భారీగా పెట్టుబడి పెడుతోందని చెప్పారు. గ్లోబల్ AI ఇండెక్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండటం మన సత్తాకు నిదర్శనమన్నారు.


