News February 23, 2025

ప్రశ్నించేందుకే అసెంబ్లీకి జగన్: వైవీ సుబ్బారెడ్డి

image

AP: ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌ను ప్రశ్నించేందుకే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని YCP నేత YV సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. YCP నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్‌కు భద్రత కల్పించకపోవడం దారుణం. వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2025

టాసుల్లో టీమ్ ఇండియా ఓటముల పరంపర

image

టీమ్ ఇండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడింది. రోహిత్ ‘హెడ్స్’ అనగానే కాయిన్ రివర్స్‌లో పడింది. దీంతో వన్డేల్లో వరుసగా 12వ మ్యాచులోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌(11 టాస్ ఓటములు)ను భారత్ అధిగమించింది. ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు 12 సార్లు టాస్ గెలవలేకపోయింది.

News February 23, 2025

BJPని గెలిపిస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది: R.కృష్ణయ్య

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లను ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఇటీవల ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఇవ్వాలి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఓటర్లు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగవద్దు’ అని సూచించారు.

News February 23, 2025

‘రాజా సాబ్’ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాప్ మోస్ట్ కమెడియన్స్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, యోగిబాబు, వీటీవీ గణేశ్‌ తదితరులను డైరెక్టర్ మారుతి తీసుకున్నట్లు టాక్. వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.

error: Content is protected !!