News September 26, 2024

రేపు తిరుమలకు జగన్: హై టెన్షన్

image

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 28, 2025

భోగాపురం కనెక్టివిటీపై బ్రేకులు

image

భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు VMRDA ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రాజెక్ట్‌పై పురోగతి కనబడటం లేదు. VMRDA ఏడాది క్రితం రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. ట్రాఫిక్‌ను అరికట్టాలనే లక్ష్యంతో ప్లాన్ చేసినా.. భూసేకరణ, వివాదాలు పనులకు అడ్డంకిగా మారాయి. ఏడాది క్రితమే ప్రాసెస్‌ ప్రారంభమైనా పురోగతి కనబడకపోవడంతో ట్రాఫిక్‌ తిప్పలు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News November 28, 2025

NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NABARD<<>>లో 91పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA/PGDM, CA/CS/CMA/ICWA, PhD, BBA, BMS, BE, B.Tech, LLB/LLM ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ DEC 20న, మెయిన్స్ JAN 25న నిర్వహిస్తారు. ఆసక్తిగల SC/ST/OBC/PWBDలకు DEC 8 – DEC 19 వరకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తారు.

News November 28, 2025

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.