News September 27, 2024

జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు

image

AP: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి అనేక మంది ఇతర మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘చట్టాన్ని గౌరవించాల్సిన మొదటి వ్యక్తి సీఎం. ఆ హోదాలోనే జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఆయనకు సిగ్గుండాలి. జగన్‌కు విశ్వసనీయత లేదు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. మత సామరస్యాన్ని పాటిద్దాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News September 27, 2024

DEVARA: రెమ్యునరేషన్ ఎవరికెంతంటే?

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది చర్చగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూ.30 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

News September 27, 2024

పసిఫిక్‌లో చైనా నౌక.. జపాన్ ఆందోళన

image

చైనాకు చెందిన యుద్ధవిమాన వాహక నౌక ‘లావోనింగ్’ గత ఏడు రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోందని జపాన్ రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నౌకకు అండగా మరిన్ని చైనా నౌకలు వెంట వెళ్తున్నాయని పేర్కొంది. తమకు చెందిన ఒకినొటోరీ దీవికి సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో ఆ నౌకలతో చైనా విన్యాసాలు చేయిస్తోందని ఆరోపించింది. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే.

News September 27, 2024

మూసీ బఫర్ జోన్ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం: దానకిశోర్

image

TG: మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మూసీ బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేస్తామని, అక్కడ పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. నదీ గర్భంలో పట్టాలున్న వారు జిల్లా కలెక్టర్లను కలవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.