News August 6, 2024

బాధితులను పరామర్శించిన జగన్

image

AP: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, గోపీ, రామకృష్ణలను ఆయన పరామర్శించి భరోసా ఇచ్చారు.

Similar News

News October 17, 2025

వాస్తు నియమాలు పాటిస్తే అనుకున్నది జరుగుతుందా?

image

వాస్తు నియమాలు పాటించినంత మాత్రాన అనుకున్నది జరిగిపోదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. కల సాకారం కావాలంటే కృషి, పట్టుదల, సరైన ప్రణాళిక కూడా ఉండాలన్నారు. ‘వాస్తు చుట్టూరా వాతావరణాన్ని మనకు సానుకూలంగా మలచి, ఉత్సాహంగా, ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. శ్రమకు, వాస్తు తోడైతే సఫలీకృత ప్రయత్నాలు తప్పక విజయవంతం అవుతాయని వాస్తు శాస్త్రం బోధిస్తోంది’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>

News October 17, 2025

లోకేశ్‌ ట్వీట్‌కు కౌంటరిచ్చిన సిద్దరామయ్య

image

APలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>ట్వీట్‌<<>> తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కర్ణాటక CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు. ‘ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారు. యాపిల్ సంస్థ కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు లోకేశ్‌ను ఎద్దేవా చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు KN, TN నెటిజన్లు <<18027162>>ట్వీట్లు<<>> చేశారు.

News October 17, 2025

నవంబర్ 11న సెలవు

image

TG: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.