News March 24, 2025

అరటి రైతులను పరామర్శించిన జగన్

image

AP: కడప జిల్లా లింగాల మండలంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో మండలంలోని తాతిరెడ్డి పల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. మండలంలో 2,460 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లు ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి జగన్‌కు తెలిపారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 25, 2025

ఆశ్లేష కురిస్తే ముసలియెద్దూ రంకెవేస్తుంది..

image

ఆశ్లేష నక్షత్రంలో ( జూలై చివరిలో/ ఆగస్టు ప్రారంభంలో) వర్షాలు బాగా పడితే, ఆ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయని, పచ్చగడ్డి, మేత పుష్కలంగా లభిస్తాయని రైతులకు నమ్మకం. ఈ సమృద్ధి కారణంగా, సాధారణంగా నీరసంగా లేదా బలహీనంగా ఉండే ముసలి ఎద్దులు కూడా కడుపునిండా తిని, కొత్త శక్తిని పొంది, సంతోషంతో ఉత్సాహంగా అరుస్తాయనేది ఈ సామెత భావం. మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారని అర్థం

News November 25, 2025

శివుడి అవతారమే హనుమంతుడు

image

హనుమంతుడు అంజనా దేవి పుత్రుడు. శివుడి వంటి పుత్రుడిని పొందాలని పరమేశ్వరుడికి పూజలు చేసింది. ఆ పూజల ఫలితంగా శివుడి వరంతోనే హనుమంతుడు జన్మించాడు. ఆయనను శివుని అవతారంగా భావిస్తారు. శివుడి లాగే ఆయన కూడా పరిపూర్ణ యోగి. అష్ట సిద్ధులకు యజమాని. ఆయన తన దైవశక్తిని ఏనాడూ స్వార్థానికి ఉపయోగించలేదు. తన ప్రభువు రాముడిని సేవించడానికి మాత్రమే వినియోగించారు. ఆయనను పూజిస్తే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట.

News November 25, 2025

సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

image

TG: కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు సెక్రటేరియట్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. అటు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.